"సుమ ఆంటీకి నేను వీరాభిమానిని".. నాని అల్లరికి హర్టయిన సుమ!
on May 17, 2021
తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన పంచ్‌లతో అందరికీ చుక్కలు చూపిస్తుంటుంది. అలాంటి సుమకే తన కామెంట్స్‌తో మాటలు రాకుండా చేశాడు హీరో నాని. కెమెరా ముందే సుమను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు నాని. దెబ్బకి సుమ దండం పెట్టేసి నేను వెళ్లిపోతున్నా అనేసింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. సుమ హోస్ట్ గా చేస్తున్న షోలలో 'క్యాష్' ఒకటి.
సినీ, టెలివిజన్ ప్రముఖులను అతిథులుగా తీసుకొని ఈ షోలో రచ్చ చేస్తుంటుంది సుమ. సెలబ్రిటీలతో సుమ చేసే సందడి మాములుగా ఉండదు. అయితే తాజాగా షోలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. నేచురల్ స్టార్ నాని.. సుమపై పంచ్‌ల మీద పంచ్‌లు వేశాడు. మే 22న ప్రసారం కానున్న సుమ 'క్యాష్' షోకి నాని 'టక్ జగదీష్' టీమ్ గెస్టులుగా వచ్చాయి. హీరో నాని, హీరోయిన్ రీతువర్మలతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, నటుడు తిరువీర్ ఈ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ వీడియోలో సుమ పరువుతీసేలా హీరో నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'సుమ ఆంటీ' అంటూ ఆమెని ఆడేసుకున్నాడు నాని. "అమ్మాయిలకు ఆంటీ అని పిలిస్తే నచ్చదు" అని సుమ అనడంతో వెంటనే అందుకున్న నాని.. ''ఈరోజు సుమ ఆంటీ షోకి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. సుమ ఆంటీకి నేను వీరాభిమానిని. సుమ ఆంటీ అంటే నాకెంతో ఇష్టం'' అంటూ రచ్చ చేశాడు. అది విని షాకైన సుమ.. "నేనెళ్లిపోతున్నా" అనేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
